రెండు వేరు వేరు దొంగతనాలు… ముగ్గురు నిందితులు అరెస్ట్
జహీరాబాద్ టౌన్ : చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేరు వేరు దొంగతనాల్లో పోయిన రూ.12 లక్షల విలువైన 16 తులాల బంగారం సీజ్ చేసి, ముగ్గురు నిందితుల రిమాండ్ చేసినట్లు డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి చెప్పారు.
దిశ, జహీరాబాద్: జహీరాబాద్ టౌన్ : చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేరు వేరు దొంగతనాల్లో పోయిన రూ.12 లక్షల విలువైన 16 తులాల బంగారం సీజ్ చేసి, ముగ్గురు నిందితుల రిమాండ్ చేసినట్లు డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వివరించారు. తాళం వేసిన ఇండ్లలో విలువైన వస్తువులు, బంగారం చోరీకి పాల్పడి, ఈ సొమ్ముతో ఆన్లైన్ గేమింగ్, ఇతర జల్సాలకు నిందితులు అలవాటు పడ్డారు. ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం వస్తాపూర్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా అనుమానంతో ముస్తాక్ హుస్సేన్, గాజుల పవన్ రెడ్డి, సిరిగిరి మహేష్ లను అదుపులోకి తీసుకొని విచారించగా గత 3, 5వ తేదీల్లో దొంగతనాలు చేసినట్లు అంగీకరించడంతో వారి నుంచి రూ.12 లక్షల విలువైన 16 తులాల బంగారం రికవరీ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో పనిచేసిన సీఐ. శివలింగం, ఎస్ఐ లు కాశీనాథ్, రాజేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు నర్సింలు, జైపాల్ రెడ్డి, అస్లాం లను అభినందించారు. విలువైన వస్తువులు, బంగారం ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం కాదని సూచించారు. రాత్రింబవళ్లు పోలీసులు పెట్రోలింగ్ చేసినప్పటికీ ఇంటి యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.