రెండు ఇళ్లలో దొంగల హల్‌చల్.. బంగారం, నగదు చోరీ

సిద్దిపేట పట్టణం శ్రీనగర్ కాలనీలోని రెండు ఇళ్ల లో

Update: 2024-08-25 15:37 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట పట్టణం శ్రీనగర్ కాలనీలోని రెండు ఇళ్ల లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...పని నిమిత్తం శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు ఇంట్లో చొరబడిన దొంగలు 14 తులాల బంగారు ఆభరణాలు, వెండి, రూ.20 వేల నగదు దొంగలించి నట్లు తెలిపారు. అదే విధంగా మరో ఇంట్లో దాదాపు రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Similar News