ఎన్నికల ఏర్పాట్లలో పొరపాట్లు రాకూడదు
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పొరపాట్లు దొర్లకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పొరపాట్లు దొర్లకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ ప్రక్కన గల ఈవీఎం గోదాంను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈవీఎం మిషన్ల పరిశీలించిన అనంతరం ఈవీఎంల రాండమైజేషన్ పంపిణీ సందర్భంగా టెంట్, టేబుల్స్, తాగునీటి వసతి, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు, అధికారులకు వేరువేరుగా కుర్చీలు, ఇతరత్రా సౌకర్యాల ఏర్పాట్లలో పొరపాటు జరగకుండా చూడాలని కలెక్టరేట్ ఏఓ రెహమాన్‌ను ఆదేశించారు. ఈవీఎం గోదాం వద్ద 24/7 విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్‌ల గుర్తింపు, పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్‌ల ప్రీ సర్టిఫికేషన్, మానిటరింగ్, మీడియా సంబంధిత విధులను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి నిర్వహించాలని కమిటీ సభ్యులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీపీఆర్ఓ రవికుమార్ పాల్గొన్నారు.