తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి నగదు, బంగారం అపహరించిన సంఘటన రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపనయ్య తండా లో చోటుచేసుకుంది.
దిశ, నిజాంపేట: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి నగదు, బంగారం అపహరించిన సంఘటన రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపనయ్య తండా లో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. తండా కు చెందిన మాలోతు దుర్గా భార్యతో కలిసి హైదరాబాద్ లో చదువుకుంటున్న తన కొడుకు రోడ్డు ప్రమాదానికి గురికాగా అతని దగ్గరకు వెళ్లి, తిరిగి మంగళవారం ఉదయం 8 గంటలకు వారి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో చూడగా బీరువలోని రెండు తులాల కమ్మలు, మూడు మాసాల మాటీలు, అద్దతులం రింగు, కొంత నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.