నీళ్లు తరలించి జిల్లా ప్రజల నోట్లో మట్టికొట్టారు: మంత్రి

ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ పార్టీ సీజనల్ ప్రేమను చూపిస్తోందని, గ్యారెంటీల పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేయాలని చూస్తోందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

Update: 2023-09-16 16:06 GMT

దిశ, ఆందోల్: ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ పార్టీ సీజనల్ ప్రేమను చూపిస్తోందని, గ్యారెంటీల పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేయాలని చూస్తోందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. శనివారం ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని సింగూర్ కెనాల్ లో 60 వేల చేప పిల్లలు, రొయ్యలు వదిలారు. అనంతరం సింగూర్ కెనాల్ కాలువపై బస్వాపూర్ వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులకు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. బస్వాపూర్ లో 300 మంది దివ్యాంగులకు పెరిగిన పెన్షన్, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులు, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, జీవో 58, 59 ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. నిన్ననే 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడంతో పాటు నేడు సీఎం కేసీఆర్ ఆసియాలోనే అతి పెద్దదైన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.

సింగూర్ జలాలను తాగునీటి కోసం హైదరాబాద్ కు తరలించి ఉమ్మడి మెదక్ జిల్లా నోట్లో మట్టి కొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ట్రిక్కులు చేసే ప్రయత్నం చేస్తోందని, ఎవరెన్నీ ట్రిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆందోల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను నియోజకవర్గ ప్రజలంతా మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News