మద్యం డబ్బులకోసం దారుణం.. తల్లి అని చూడకుండా కొడుకు ఏం చేశాడంటే?

మద్యం డబ్బుల కోసం కుమారుడు కృరంగా మారాడు.. డబ్బులు ఇవ్వడం లేదంటూ కోపంతో తల్లిని కొడవలి తో కొట్టి చంపిన దారుణ ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తొగితలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు

Update: 2023-08-04 06:08 GMT

దిశ, హవేలీ ఘనపూర్ : మద్యం డబ్బుల కోసం కుమారుడు కృరంగా మారాడు.. డబ్బులు ఇవ్వడం లేదంటూ కోపంతో తల్లిని కొడవలి‌తో కొట్టి చంపిన దారుణ ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తొగితలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. తోగిట గ్రామానికి చెందిన పుస్థి నర్సమ్మ(45) వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆమెకు ఇద్దరి పిల్లలు భాను ప్రసాద్, బాలు ఉన్నారు. భాను ప్రసాద్ గురువారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని కోరాడు. ప్రతి సారి డబ్బుల కోసం వేదిస్తుండడం తో ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో తల్లి కొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన కుమారుడు భాను ప్రసాద్ తల్లిపై కొడవలి తో దాడి చేయగా తీవ్ర గాయాలైన ఆమె రక్తపు మడుగుల్లో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న హావేలి ఘనపూర్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి నిందితుని అదుపులోకి తీసుకున్నారు.

ఐదు సంవత్సరాల క్రితం భాను ప్రసాద్ తో కలిసి నరసమ్మ తన తల్లిని బాలమని ఆస్తికోసం దాబాపై నుంచి తోసేసి హత్య చేసిన కేసులో జైలుకెళ్లి బయటకు వచ్చారు. ఇప్పుడు కుమారుడు మద్యం కోసం తల్లిని చంపడం పై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Similar News