SP : జిల్లా వ్యాప్తంగా నెలరోజుల పాటు పోలీసు యాక్ట్ అమలు
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు (నవంబర్ 1వ తేదీ నుంచి 30 వరకు) 30, 30(ఎ) పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు.
దిశ, సంగారెడ్డి : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు (నవంబర్ 1వ తేదీ నుంచి 30 వరకు) 30, 30(ఎ) పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజా ధనానికి నష్టం కలిగించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.