ఆ మలుపులు ప్రమాదాలకు పిలుపులు..
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం,రాజీవ్ రహదారి నుంచి
దిశ, కొమురవెల్లి : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం,రాజీవ్ రహదారి నుంచి మల్లన్న ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గం ప్రమాదాలకు అడ్డాగా మారింది.ఇటీవల రాజీవ్ రహదారి నుంచి మల్లన్న ఆలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణం పనులు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా మూలమలుపు వద్ద తరుచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఆర్ అండ్ బి అధికారుల పర్యవేక్షణ లోపం తో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఏలాంటి సూచిక బోర్డులు,భద్రత ప్రమాణాలు ఏర్పాటు చేయకుండా వదిలేశాడు.నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం అది. దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలతో వాహనాదారులు అవస్థలు పడుతున్నారు.మూలమాలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు పూర్తి చేసి నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు.