సెల్‌టవర్‌ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌

సెల్‌ టవర్‌ ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని, తనకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లును మంజూరు చేయాలని, పింఛన్‌ రావడం లేదని విసుగు చెంది సోమవారం జోగిపేటలో సెల్‌టవర్‌ను ఎక్కాడు.

Update: 2023-04-10 10:32 GMT

దిశ, అందోల్: సెల్‌ టవర్‌ ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని, తనకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లును మంజూరు చేయాలని, పింఛన్‌ రావడం లేదని విసుగు చెంది సోమవారం జోగిపేటలో సెల్‌టవర్‌ను ఎక్కాడు. జోగిపేటలోని మల్లన్న కాలనీలో నివాసం ఉంటున్న కుమ్మరి రాంచెందర్‌ సెల్‌టవర్‌ ఎక్కి దూకుతానంటూ బెదిరించాడు. విషయం తెలుసుకున్న జోగిపేట ఎస్‌ఐ జయశంకర్‌ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అతనితో మాట్లాడారు.

తన కాలుకు అపరేషన్‌ అవసరమని, పింఛన్‌ ఇవ్వడం లేదని, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేయించాలని, తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో తన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఎస్‌ఐ హామీ ఇచ్చారు. డబుల్‌ బేడ్‌ రూం ఇళ్లు మంజూరు కోసం సంబంధిత అధికారులకు తెలియజేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆ యువకుడు సెల్‌టవర్‌ నుంచి కిందకు దిగాడు. రాంచెందర్‌పై నర్సాపూర్, మెదక్, జోగిపేట పోలీస్‌ స్టేషన్‌లలో చిల్లర కేసులున్నాయని ఎస్‌ఐ తెలిపారు. అనంతరం అతడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి అతనికి కౌన్సిలింగ్‌ ఇంటికి పంపారు.

Tags:    

Similar News