గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి : మంత్రి పొన్నం
ప్రభుత్వం చేసే ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్
దిశ,హుస్నాబాద్ : ప్రభుత్వం చేసే ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలం జిల్లెల్ల గడ్డ గ్రామంలో మంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండలంలోని 17 గ్రామాల అధ్యక్షుడు పార్టీ ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ...త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండనున్నాయని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరాలని సూచించారు.
అందుకోసం నేతలు ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పని చేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఆర్టీసీ లో మహిళలకు ఇప్పటివరకు 126 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేశారని,200 యూనిట్ల ఉచిత విద్యుత్ ,500 రూపాయలకి గ్యాస్ అందిస్తున్నామని ఎవరికైనా ఇవి రాకపోతే గ్రామాల్లో పిర్యాదు చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేసిందని ,ఇప్పటికే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు.
హుస్నాబాద్ పట్టణంలో ఇప్పటికే నాలుగు లైన్ల రహదారి కూడళ్ల అభివృద్ధి ,ఎల్లమ్మ చెరువు అభివృద్ది, సర్వాయి పేట, మహాసముద్రం గండి ద్వారా హుస్నాబాద్ ను టూరిజం లో మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే గౌరవెల్లి కాలువలు పూర్తి చేసి ఇక్కడి రైతులకు సాగు నీరు అందిస్తామన్నారు. హుస్నాబాద్ లో నిరుద్యోగులకు ఇతర దేశాలకు వెళ్ళే వారికి టాం కాం కంపెనీ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేస్తామని హామీ ఇచ్చారు.హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అక్కన్నపేట లో పారిశ్రామిక కారిడార్ ,ఇక్కడి వారికి విద్యా ,వైద్యంలో తమ ప్రథమ ప్రాధాన్యత గా చెప్పుకొచ్చారు. ప్రజలకు అనారోగ్యం వచ్చినప్పుడు చేసుకోవడానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు వెల్లడించారు. ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని ఇది పారదర్శకంగా జరుగుతుందని ఇందులో ఎవరి జోక్యం ఉండదని తెలిపారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. హైదరాబాద్ లో ఎన్ని సమావేశాలు ఉన్న హుస్నాబాద్ వారు వస్తే కలవడానికి వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. హుస్నాబాద్ కి 250 పడకల ఆసుపత్రి ,పెద్ద ఎత్తున రోడ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. త్వరలోనే మంజూరు అయిన పనులకు శంకుస్థాపన తీసుకుంటామని వెల్లడించారు.
యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపిన మంత్రి
తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించి నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్ కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్ కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, హుజురాబాద్ నియోజకవర్గం తో పాటు మండల అధ్యక్షులను అభినందించారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేసిన వారికి భవిష్యత్తులో పదవులు వరిస్తాయని తెలిపారు.