వీడిన హత్య మిస్టరీ.. భార్యతో ఆ పని చేయించి ఆ తరువాత భర్తే..

సిద్దిపేట పట్టణంలోని బాలాజీ గార్డెన్ సమీపంలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Update: 2023-02-22 11:09 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట పట్టణంలోని బాలాజీ గార్డెన్ సమీపంలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వన్ టౌన్ సీఐ బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు బీబీపేట మండలం ఇస్సానగర్ చెందిన బోదాసు లింగంతో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇరువురి మధ్య గొడవలు జరగడంతో కొంత కాలంగా ఎవరి గ్రామాల్లో వారు ఉంటున్నారు. అయితే వారం రోజుల క్రితం బోదాసు లింగం తన భార్యను మంచిగా చూసుకుంటానని సిద్దిపేటకు తీసుకొచ్చాడు.

కాగా మద్యానికి బానిసైన లింగం మద్యం తాగడానికి డబ్బుల కోసం ఈ నెల 18వ తేదీన తన భార్యను కొమిరి చంద్రశేఖర్ అనే వ్యక్తితో వ్యభిచారం చేయించాడు. వచ్చిన డబ్బుల విషయంలో చంద్ర శేఖర్ ముందే తన భార్యతో బోదాసు లింగం గొడవ పెట్టుకొన్నాడు. లింగం తన భార్య జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టి గొంతు నులిమి చంపాడు. ఈ మేరకు నిందితులు బోదాసు లింగం, కొమిరి చంద్ర శేఖర్ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హత్య కేసు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ బిక్షపతి, ఎస్ఐ నరసింహరావు, క్రైం పార్టీ సిబ్బంది కనకరావు, రాజు, భూమలింగంలను ఎసీపీ దేవరెడ్డి అభినందించారు.

Tags:    

Similar News