కుల వృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్ షుగర్లోని నల్లవాగు ప్రాజెక్టులో చేప పిల్లలను నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి విడుదల చేశారు.

Update: 2024-11-09 13:30 GMT

దిశ, కల్హేర్/సిర్గాపూర్ : సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్ షుగర్లోని నల్లవాగు ప్రాజెక్టులో చేప పిల్లలను నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముదిరాజ్ జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం రేవంత్ రెడ్డి ఉచిత చేప పిల్ల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ముదిరాజుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అంతేకాకుండా కుల వృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

100% రాయితీ పై చేప పిల్లలను విడుదల చేసేందుకు తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. అలాగే చేప పిల్లలను పెంచిన తర్వాత వాటిని అమ్ముకోవడానికి కూడా వాహన సౌకర్యం కూడా తమ ప్రభుత్వం కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గున్నల నర్సింలు చీఫ్ ప్రమోటర్ మత్స్యకార సంఘం, మత్స్య శాఖ అధికారులు, రాం రెడ్డి, బాల్ రెడ్డి, జైరాజ్, కృష్ణా మూర్తి, శ్యామ్ ప్రసాద్ ముదిరాజ్, విఠల్, నరేందర్, మదు, రవి పాటిల్ మాజీ సర్పంచ్, జ్ఞానేశ్వర్, మోహన్ రెడ్డి, వెంకట్ రాం రెడ్డి, సాయిలు బండారి, దేవదాస్, పండరి, బుంగొండ, నారాయణ, మారుతి ఉపసర్పంచ్, వీర చారి, మహేశ్వర్ పాటిల్, విఠల్ మాజీ ఉప సర్పంచ్, ఉప్పరీ విఠల్ తదితర మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.


Similar News