Tehsildar Office : కళ్యాణ లక్ష్మి ఫైల్ కదలాలంటే ముడుపులు ముట్టాల్సిందే.!

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రంది పడొద్దనే

Update: 2024-07-22 16:20 GMT

దిశ,దుబ్బాక : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రంది పడొద్దనే ఉద్దేశ్యంతో తెలంగాణ సర్కార్‌ ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌’ అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా ఆడబిడ్డ వివాహానికి రూ.1,00,116 లను ఆర్థిక సహాయంగా అందజేస్తూ అండగా నిలుస్తున్నది తెల్సిందే. అయితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణంలో నెల క్రితం ఓ పేదింటి కుటుంబం ఆడబిడ్డ విహహం జరిపి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మికి మీ సేవలో దరఖాస్తు చేసుకొని దరఖాస్తు ఫారం పై గెజిటెడ్ సంతకం చేయించుకొని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ అధికారికి దరఖాస్తు ను ఇవ్వగా ఆ ఆధికారి దరఖాస్తు దారునితో డబ్బులు ఇస్తేనే నీ ఫైల్ పై కదలడం జరుగుతదని లేదా ఇక్కడే ఉంటుందని అనడంతో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి దిశ విలేఖరి దృష్టికి తీసుకొచ్చారు.

ఆ బాధితుని వివరాలు కోరగా ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ గత నెల క్రితం మా చెల్లి వివాహం చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న కల్యాణ లక్ష్మి పథకం వినియోగించుకునేందుకు మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దరఖాస్తు ఫారం పై గెజిటెడ్ తో సంతకం, స్టాంపు చేయించుకొని తహసీల్దారు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారికి కళ్యాణ లక్ష్మి ఫారం దరఖాస్తును ఇవ్వగా డబ్బులు అవుతాయి అంటూ అధికారి మాట్లాడాడు. డబ్బులు ఎందుకు.? డబ్బులు ఇవ్వడానికి ఇది దొంగ ఫైలు కాదు.( జన్యూన్ ఫైల్ ) కావాలంటే మీరు ఎంక్వయిరీ చేయండి అంటూ అనగా, జూనియర్ అసిస్టెంట్ తహసీల్దార్ వద్దకు ఫైల్ ని తీసుకెళ్లి కళ్యాణ లక్ష్మి ఫైల్ పై ఫేక్ సంతకాలు,స్టాంపు చేయించుకొని వచ్చాడని తహసీల్దార్ తో జూనియర్ అసిస్టెంట్ తెలుపగా తహసీల్దార్ మాట్లాడుతూ నువ్వు ఏ మీ సేవలో దరఖాస్తు చేసుకున్నావు.అది నీ పైలేనా ఇతరుల ఫైలా.! అని అడుగగా ఆ ఫైల్ నా చెల్లి ఫైలే నెల క్రితం మా చెల్లి విహహం చేశాం. అని చెప్పిన వినకుండా అవహేళన గా మాట్లాడుతూ తన ఫోన్ ను కార్యాలయ సిబ్బందితో లాక్కున్నారని బాధితుడు ఆవేదనను వ్యక్తం చేశారు.

Tags:    

Similar News