దిశ, మెదక్ ప్రతినిధిః కొండాపూర్ లో వివాదాస్పదంగా మారిన భూముల నిర్ధారణకు జిల్లా కలెక్టర్ కమిటీ వేసేందుకు నిర్ణయించారు. 144 సర్వే నంబర్ లో 11.37 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు అక్రమంగా పట్టా చేశారంటూ గ్రామస్తులు కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. దిశ పత్రికలో సైతం వరస కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ స్పందించి కొండాపూర్ భూముల నిర్ధారణకు కమిటీ వేస్తున్నట్టు గ్రామస్తులతో తెలిపారు. సోమవారం కొండాపూర్ కు చెందిన నర్సింగరావు, నాగరాజు, ఆంజనేయులు తో పాలు పలువురు గ్రామస్తులు ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కొండాపూర్ భూముల వ్యవహారం అంతా తెలుసని, అందు కోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. కమిటీ నిర్ధారణ చేసిన తర్వాత 144 లో ఉన్న భూమి ప్రభుత్వ భూమినా లేక పట్టా భూమి అనేది తేలుతుందని చెప్పారు.