ప్రాజెక్టుల నిర్మాణమే రైతులకు ఆదాయాభివృద్ధి : క్యూయు డాంగ్యూ

తెలంగాణలో ప్రాజెక్టులు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని జాతీయ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రతినిధి క్యూయు డాంగ్యూ అన్నారు.

Update: 2023-06-15 12:17 GMT

దిశ, ములుగు : తెలంగాణలో ప్రాజెక్టులు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని జాతీయ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రతినిధి క్యూయు డాంగ్యూ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని వ్యవసాయరైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో సంభాషించి రైతులతో ఆయన తెలంగాణలో చేపడుతున్న పలుఅభివృద్ధి విషయాల పై రైతులు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం విభిన్నంగా అభివృద్ధి చెందుతుందని వ్యవసాయ రంగంలో దేశంలోనే ముందంజలో ఉందని నేను గ్రహించాను అన్నారు. అదేవిధంగా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో తర్వాత రైతులు సంతృప్తిగా ఉన్నారన్నారు. సంవత్సరంలో మూడు పంటలుగా సాగు చేస్తూ రైతులు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారని వారు తెలిపారు. జాతీయ గ్లోబల్ వరుస రంగంలో మార్పులకు ముఖ్యంగాచూస్తే తెలంగాణ ఒక అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు.

కొండపోచమ్మ మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులు ఉపాధి కలుగుతుందని సంవత్సరంలో మూడు పంటలు సాగు చేయవచ్చు అని వారు తెలిపారు. రైతులు పంటతో పాటు తమ పిల్లలను ఉన్నత చదువులను చదివేందుకు కృషి చేయాలని వారు తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టుల వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయాని జాతీయ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రతినిధికి యూ క్యూయు డాంగ్యూ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని మండలంలోని వ్యవసాయ రైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రైతులతో ఆయన తెలంగాణ చేపడుతున్న పలుఅభివృద్ధి విషయాల పై రైతులు అడిగి తెలుసుకున్నారు.

ప్రపంచదేశాల్లో భారతదేశం విభిన్నంగా అభివృద్ధి చెందుతుందని వ్యవసాయ రంగంలో ముందంజలో ఉందని నేను గ్రహించాను అన్నారు. అదేవిధంగా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో తర్వాత రైతులు సంతృప్తిగా ఉన్నారు అన్నారు. సంవత్సరంలో మూడు పంటలుగా సాగు చేస్తూ రైతులు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారని వారు తెలిపారు. జాతీయ గ్లోబల్ వరుస రంగంలో మార్పులకు ముఖ్యంగా చూస్తే తెలంగాణ ఒక అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. కొండపోచమ్మ మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులు ఉపాధి కలుగుతుందని సంవత్సరంలో మూడు పంటలు సాగుచేయవచ్చని వారు తెలిపారు. రైతులు పంటతో పాటు తమ పిల్లలను ఉన్నత చదువులను చదివేందుకు కృషి చేయాలని వారు తెలిపారు. కొండపోచమ్మ భారీ నీటిపారుదల ప్రాజెక్టు వల్ల వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్నారు.

క్యూయు డాంగ్యూ మాట్లాడుతూ నేను కూడా ఒక రైతు బిడ్డను అని మా తల్లిదండ్రులు చదివించడం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రైతుల ఆదాయంలో మార్పు సంభవిస్తుందని ఈ ఆదాయాలతో పిల్లల విద్యను జీవన ప్రమాణాలను పెంచుకోవాలని సూచించారు. సమగ్ర వ్యవసాయ విధానాన్ని పాటించాలని రైతుకు కావలసిన అన్ని ఆహార పదార్థాలను రైతే పండించుకోవాలని సూచించారు. అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ తొమ్మిది సంవత్సరాలుగా మన వ్యవసాయ రంగంలో మంచి మార్పు సంభవించిందని తెలియజేశారు.

ఈ వ్యవసాయం అభివృద్ధిని చూడడానికి వివిధ దేశాల నుంచి ప్రజాప్రతిని వచ్చి చూసి పోతున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ కమిషనర్ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీదేవి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, రైతు సమన్వయ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచులు అచ్చం గారి భాస్కర్, భాగ్య బిక్షపతి, కృష్ణ యాదవ్, ఎంపీటీసీలు ధనలక్ష్మి కృష్ణ, చైతన్య శంకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీత, జిల్లాలోని వ్యవసాయ శాఖ సిబ్బంది, ఉద్యాన శాఖ సిబ్బంది ఆయిల్ ఫిట్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News