దిశ ఎఫెక్ట్..హరితహారం చెట్ల నరికివేత పై విచారణ

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదం ప్రతి ఒక్క అధికారి నూట వింటూనే ఉంటాం అలాంటి హరితహారం చెట్లను కొంతమంది నరికి హరితహారానికి ఆటంకం కలిగిస్తున్నారు.

Update: 2024-12-19 15:27 GMT

దిశ,టేక్మాల్ : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదం ప్రతి ఒక్క అధికారి నూట వింటూనే ఉంటాం అలాంటి హరితహారం చెట్లను కొంతమంది నరికి హరితహారానికి ఆటంకం కలిగిస్తున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని చంద్రు తండా గ్రామ పంచాయితీకి వెళ్లే రోడ్డు ఇరువైపులా హరితహారంలో నాటిన చెట్లను కొంత మంది రైతులు నరికివేశారు. ఈ విషయం దిశ దినపత్రికలో పచ్చని చెట్లపై గొడ్డలి పోటు అనే శీర్షికన ప్రచురితమైంది.ఈ వార్తకు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పందించి చెట్లు నరికివేత పై విచారణ చేపట్టారు. ఈ చెట్లను రైతులున్నరకినట్లుగా నిర్ధారించి వారికి నోటీసులను అందజేశారు. దీంతోపాటు ఐదు వేల రూపాయలను జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పరమైన ఆస్తులను సంస్థలను పథకాలకు ఎవరు నష్టం చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


Similar News