ఉత్తరాది నేతలు తెలంగాణలో చిచ్చుపెడుతుండ్రు : తన్నీరు శ్రీనిత రావు
తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇస్తే వచ్చింది కాదని కొట్లాడి పోరాడి సాధించుకున్నదని మంత్రి తన్నీరు. హరీష్ రావు సతీమణి శ్రీనిత అన్నారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇస్తే వచ్చింది కాదని కొట్లాడి పోరాడి సాధించుకున్నదని మంత్రి తన్నీరు. హరీష్ రావు సతీమణి శ్రీనిత అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తర భారత దేశ నాయకులు తమ ఆధిపత్యం కోసమే పచ్చని తెలంగాణలో చిచ్చు రేపు తున్నారన్నారు. సిద్దిపేట పేరును దేశవ్యాప్తం చేసిన హరీష్ రావు పేరును ప్రపంచవ్యాప్తం చేయాలని సిద్దిపేట ప్రజలను కోరారు. హరీష్ రావు ఎక్కడికి వెళ్లినా ఏది చూసినా దాన్ని సిద్దిపేట ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాడని తెలిపారు. తాము ఫ్యామిలీతో ఫారెన్ వెళ్ళినప్పుడు చూసిన డైనోసార్ పార్క్ ను కోమటి చెరువు వద్ద ఏర్పాటు చేయడమే దానికి నిదర్శనం అన్నారు.
ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిలా ఉండే హరీష్ రావును ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలన్నారు. 20 సంవత్సరాల కింద సిద్దిపేటకు ఇప్పటి సిద్దిపేటకు తేడా స్పష్టంగా కనిపిస్తుందని, ఈ మార్పుకు మంత్రి హరీష్ రావే ముఖ్యకారణమని ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఎన్నికల్లో 1,51,000 మెజార్టీ అందించి మీ బిడ్డ అయిన హరీష్ రావు ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ. విజిత వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు కొండం.కవిత సంపత్ రెడ్డి, బ్రహ్మం, గుడాల.సంధ్య శ్రీకాంత్ గౌడ్, భూంపల్లి.శ్రీలత శ్రీహరి, సాకి బాల్ లక్ష్మి ఆనంద్, నాయకులు మణిదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.