ప్రతిభావంతులైన క్రీడాకారులు నెలవు మెదక్ జిల్లా
క్రీడలకు మెదక్ జిల్లా నెలవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
దిశ, మెదక్ ప్రతినిధి: క్రీడలకు మెదక్ జిల్లా నెలవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 9, 10 తేదీల్లో మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలలో జిల్లాలోని ఖేలో ఇండియా సైక్లింగ్ సెంటర్ నుంచి ఆరుగురు క్రీడాకారులు బంగారు, వెండి, రజత పతకాలు సాధించారు. దీంతో జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా కలెక్టర్ క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఖేలో ఇండియా సైక్లింగ్ సెంటర్ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కూడా రాణించి మన జిల్లా పేరును భారతదేశ పటంలో ముందు వరుసలో ఉంచాలని శిక్షకుడు యాదగిరికి సూచించారు. ఈ నెల 20 నుంచి 25 వరకు హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొనబోతున్నారని వివరించారు.
అండర్ 16 మాస్టార్ట్ విభాగంలో దిలీప్ బంగారు పతకం,
2- 16 ఏళ్ల లోపు మాస్టార్ట్ విభాగంలో అనుజ్ఞ వెండి పతకం,
3-14 లోపు మాస్టార్ట్ విభాగంలో ప్రణయ్ బంగారు పతకం,
4- 14 ఏళ్ల లోపు మాస్టార్ట్ విభాగంలో అనిల్ తేజ్. వెండి పతకం,
5- 14 ఏళ్ల లోపు ఇండివిజువల్ టైం ట్రయల్ విభాగంలో సిద్ధార్థ వెండి పతకం,
6-14 ఏళ్ల లోపు ఇండివిజువల్ టైం ట్రయల్ విభాగంలో హరీష్ రజత పతకం సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి నాగరాజు సిబ్బంది, రాజు క్రీడాకారులు పాల్గొన్నారు.