వేసవిలో వన్య ప్రాణులకు ప్రత్యేక రక్షణ కల్పించాలి

వేసవిలో వన్య ప్రాణులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

Update: 2024-03-22 14:54 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: వేసవిలో వన్య ప్రాణులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా పోచారంలో ఉన్న వన విజ్ఞాన కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు.  4.5 కిలో మీటర్లు సఫారీ వాహనంలో అటవీ ప్రాంతం తిరిగి జింకల ప్రత్యుత్పత్తి కేంద్రంను జింకలని, నెమళ్ళు, మనుబోతులు, పక్షులను, ఇతర అటవీ జంతువులను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వన్య ప్రాణులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, జంతువులకు ఆహారం, త్రాగు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. వన విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, అటవీ విస్తీర్ణం, సందర్శకుల సమయ పాలన గురించి అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అటవీ జంతువులకు త్రాగు నీరు, ఆహారం , రక్షణ ఏ విధంగా ఇస్తారు అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, హవేలీ ఘనపూర్ మండలం తహసీల్దార్ నారాయణ, అటవీ సెక్షన్ అధికారి శ్రావణ్ కుమార్, బీట్ ఆఫీసర్ ప్రసాద్ గౌడ్, అటవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News