SP Chennuri Rupesh : ఇన్వెస్టిగేషన్‌లో లోపాలు ఉంటే సహించేది లేదు

నేరాల ఇన్వెస్టిగేషన్ లో లోపాలు ఉంటే సహించేది లేదని సంగారెడ్డి జిల్లా

Update: 2024-07-30 14:08 GMT

దిశ, సంగారెడ్డి : నేరాల ఇన్వెస్టిగేషన్ లో లోపాలు ఉంటే సహించేది లేదని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను హెచ్చరించారు. మంగళవారం అర్ధవార్షిక క్రైమ్ రివ్యు మీటింగ్ సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్) లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ నేరస్తులను పీటీ వారెంట్ ద్వారా కోర్టు లో ప్రవేశపెట్టి సైబర్ బాధితులకు భాసటగా నిలవాలని సూచించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో వుండాలని, గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అనే విషయాలపై తగు సలహాలు మరియు సూచనలు చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేసి భాదితులకు అండగా నిలవాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆక్సిడెంట్ పోర్న్ ఏరియాగా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. తరచూ వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించాలని, ముఖ్యంగా ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పు పై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేర నియంత్రణతో పాటు, జరిగిన నేరాలను చేదించడంలో ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ, స్వచ్చంధంగా వారి గ్రామాలలో, ప్రధాన కూడళ్లలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు, సంగారెడ్డి డీయస్పీ సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డీయస్పీ రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డీయస్పీ రామ్ మోహన్ రెడ్డి, నారాయణ ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, డీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఐ.టి. సెల్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్- ఇన్స్పెక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News