దిశ, హుస్నాబాద్ః రాఖీ అనేది బంధాన్ని కాపాడేది. కానీ ఆ బంధమే లేకపోయినా సరే.. దానికి గుర్తుగా రాఖీ కడుతున్నారు ఆ సోదరీమణులు. 10 సంవత్సరాలైనా ఆ సోదరీమణులు ప్రతి ఏటా విగ్రహానికి రాఖీ కట్టి తమ ప్రేమను, ఆప్యాయతను చాటుకుంటున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం రాజు తండాకు చెందిన గుగులోతు లింగయ్య-సత్తవ్వ లకు కూతుళ్లు రాజమ్మ బూలమ్మ, శ్రీలత కాగా ఒక్కగానొక కుమారుడు నరసింహ నాయక్. సైన్యంలో చేరి సి ఆర్ పి ఎఫ్ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో 2014 చత్తీస్ గడ్ లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి వీరమరణం పొందాడు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి ఏటా నరసింహ నాయక్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అక్కాచెల్లెళ్లు రాఖీలు కడుతూ విగ్రహంలో తమ సహోదరుని చూసుకుంటూ ఉన్నారు. సోమవారం రాఖీ పండుగ కావడంతో రాజు తండాకు నరసింహ నాయక్ అక్క చెల్లెల్లు చేరుకొని విగ్రహ రూపంలో ఉన్న తమ సోదరున్ని చూసుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు.