ఇండస్ట్రీయల్, అగ్రికల్చరల్ హబ్ గా సిద్ధిపేట : మంత్రి హరీష్ రావు

ఇండస్ట్రీయల్, అగ్రికల్చరల్ హబ్ గా సిద్ధిపేట జిల్లా రూపుదిద్దు కాబోతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

Update: 2023-02-24 10:15 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఇండస్ట్రీయల్, అగ్రికల్చరల్ హబ్ గా సిద్ధిపేట జిల్లా రూపుదిద్దు కాబోతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యచంద్ర తేజతో కలిసి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్ నిర్మాణం పూర్తి కావస్తున్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రమిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద పుడ్ ప్రాసెసింగ్ రైస్ మిల్లు వర్గల్ లో, కొండ పోచమ్మ సాగర్ వద్ద భారీ కోకాకోలా ఉత్పత్తి ప్లాంట్, బెజ్జంకి దాచారం వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నాయన్నారు. ఇప్పటికే సిద్దిపేట వద్ద డీఎక్స్ ఎన్ పరిశ్రమ నెలకొల్పినట్లు పేర్కొన్నారు. స్వయం ఉపాధి శిక్షణను గ్రామీణ యువత సద్వినియోగ పరుచుకోవాలన్నారు. శిక్షణ సర్టిఫికెట్ తోపాటు రుణాలు సైతం మంజూరు చేయాలని బ్యాంకర్లను మంత్రి కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ కొండం కవిత-సంపత్ రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యజిత్, యూనియన్ బ్యాంకు మేనేజర్ సత్యం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట శివారు పొన్నాల వద్ద రాజీవ్ రహదారి పై నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించాడు. అనంతరం మంత్రి హరీష్ రావు ఫ్లైఓవర్ పై బుల్లెట్ ని నడిపారు.

శంభూ దేవాలయ పునర్నిర్మాణం పనులకు శంకుస్థాపన

వెయ్యేండ్ల చరిత్ర కలిగిన శంభూ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని శంభూ దేవాలయ పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్ట వేడుకలకు మంత్రి హాజరైయ్యారు. అనంతరం పాలమాకుల రేణుకా మాత ఆలయ ప్రాంగణంలో గౌడ సంఘం ఫంక్షన్ హాల్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కొండంరాజ్ పల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత నాభిశీల సీతాల దేవి బొడ్రాయి, దుర్గామాత మొదటి వార్షికోత్సవ వేడుకలకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, బీఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News