Collector : పది రోజుల్లో స్వంత భవనం లోకి మారాలి
కేంద్రీయ విద్యాలయం స్వంత భవనం పూర్తయిన నేపథ్యంలో వారం పది రోజుల్లో నూతన భవనంలో తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ సూర్య ప్రకాష్ ను కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : కేంద్రీయ విద్యాలయం స్వంత భవనం పూర్తయిన నేపథ్యంలో వారం పది రోజుల్లో నూతన భవనంలో తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ సూర్య ప్రకాష్ ను కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లి లో నిర్మాణం పూర్తయిన కేంద్రీయ విద్యాలయం భవనంను, భవనం పరిసరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అదే విధంగా మెట్టపల్లి గ్రామంలోని సుడా లే అవుట్ ను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వెంచర్ లో 111 ప్లాట్లకు 96 ప్లాట్లు అమ్ముడుపోక పోవడంతో ధర తగ్గించి ప్లాట్ల అమ్మకానికి చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, వారికి కల్పిస్తున్న సౌకర్యల గురించి ఆరా తీసిన కలెక్టర్ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల భవనం నిర్మాణం కోసం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో వెంటనే కళాశాల భవన నిర్మాణం చేపట్టాలని ఈడబ్ల్యూఐడిసి ఈఈ ని ఫోన్ ద్వారా ఆదేశించారు. చిన్నకోడూరు మండలం రామాంచలో నిర్మించిన సుడా రిసార్ట్ ను, సుడా పార్క్ ను కలెక్టర్ మను చౌదరి పరిశీలించి 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన పార్క్ ను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రీత్ కుమార్ ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్లు అధికారులు తదితరులు ఉన్నారు.