'సంగారెడ్డి ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నారా'
అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడగొట్టాలని మంత్రి హరీశ్ రావు చాలెంజ్ చేస్తున్నారని, సంగారెడ్డి ప్రజల దమ్ము చూపించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
దిశ, సంగారెడ్డి : అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడగొట్టాలని మంత్రి హరీశ్ రావు చాలెంజ్ చేస్తున్నారని, సంగారెడ్డి ప్రజల దమ్ము చూపించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన విజయబేరి సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు తనను ఓడగొడతానంటూ చాలెంజ్ చేస్తున్నాడన్నారు. సంగారెడ్డి ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నారా సంగారెడ్డి దమ్మెంటో చూపిస్తా రా అంటూ జగ్గారెడ్డి కోరారు. మంత్రి హరీశ్ రావు సంగారెడ్డిలో తిరుగుతారా.. చూస్తా హరీశ్ రావు.. అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కష్టమొచ్చినోనికి అందుబాటులో ఉంటానని, కడుపులో పెట్టుకుంటానని, తనను కూడా మీరంతా కడుపులో పెట్టుకోవాలని కోరారు. సోనియాగాంధి, ప్రియాంకగాంధీలు ఆరు గ్యారంటీలు ఇచ్చారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రతి నెల రూ. 2500లు, గ్యాస్ సిలిండర్ రూ.500లకు, రైతు రుణమాపీ రూ.2లక్షలు, రైతులకు 15వేలు, కౌలు రైతులకు 12వేలు, భూమిలేని నిరుపేదలకు 12వేలు, ఇండ్లులేనివారికి 100 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందిస్తామన్నారు.
బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ రెండు వేలు, క్వాటర్లు పంపిస్తరు వాటిని పట్టించుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తెలంగాణ ఇంచార్జీ మానిక్ రావు ఠాక్రో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా, పార్టీ నాయకులు శ్రీధర్ బాబు, అద్దంకి దయాకర్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, సురేష్ షెట్కార్, దీపదాసు మున్సిసి, రోహిత్ చౌదర్, సందీప్, జట్టి కుసుమ్ కుమార్, వి.హనుమంతరావు, దామోదర్ రెడ్డి, తోపాజి అనంతకిషన్, చెర్యాల ఆంజనేయులు, కూన సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.