రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ : డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం

తెలంగాణ రైతులు ఇబ్బందులు పడకుండా వారి సంక్షేమం కోసం కృషి చేసిన అభినవ రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని డీసీసీబీ వైస్ ఛైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు.

Update: 2023-06-03 13:44 GMT

దిశ, సంగారెడ్డి : తెలంగాణ రైతులు ఇబ్బందులు పడకుండా వారి సంక్షేమం కోసం కృషి చేసిన అభినవ రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని డీసీసీబీ వైస్ ఛైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి క్రాస్ రోడ్ వద్ద రైతువేదికలో రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం మాణిక్యం మాట్లాడుతూ.. గత తొమ్మిది సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ విజేందర్ రెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ శ్రీనివాస్ రావు, పోతిరెడ్డిపల్లి క్లస్టర్ ఏఈవో గాయత్రి, గజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డా.వైద్యనాథ్, ఏవో ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్లు మరియు అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News