రికార్డ్ సృష్టించిన ఆర్టీసీ…ఒక్కరోజు రూ.31.92 లక్షల ఆదాయం

దసరా పర్వదినం తర్వాత తిరుగు ప్రయాణానికి ఉన్న ప్రయాణికుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని జహీరాబాద్ డిపో మేనేజర్ అధికారులు, సిబ్బంది సహకారంతో తగిన విధంగా చర్యలు తీసుకొని సక్సెస్ అయ్యారు.

Update: 2024-10-15 14:08 GMT

దిశ, జహీరాబాద్: దసరా పర్వదినం తర్వాత తిరుగు ప్రయాణానికి ఉన్న ప్రయాణికుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని జహీరాబాద్ డిపో మేనేజర్ అధికారులు, సిబ్బంది సహకారంతో తగిన విధంగా చర్యలు తీసుకొని సక్సెస్ అయ్యారు. ఒక్కరోజులో అత్యధిక ప్రయాణికులను చేరవేసి గరిష్ట లాభాలను ఆర్జించి రికార్డు సృష్టించారు. 43,752 మంది ప్రయాణికుల చేరవేసి రూ.31.92 లక్షల ఆదాయం సాధించారు. దసరా స్పెషల్ ఆపరేషన్ - 2024 లో భాగంగా రిటర్న్ జర్నీ ప్రయాణికుల కోసం సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు , రెగ్యులర్ సర్వీసుల ద్వారా హైదరాబాద్- బీదర్ రూట్లలోజహీరాబాద్ డిపోకు , రూ.31,92,249 నికర ఆదాయం వచ్చిందని , 43,752 మంది ప్రయాణికులను జహీరాబాద్ డీపో బస్సుల ద్వారా గమ్య స్థానాలకు స్థానిక సిబ్బంది సురక్షితంగా చేరవేసిందని డీఎం.జాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని మంచి ఫలితాలు సాధించి అందరి మన్ననలు అందుకున్నారు.


Similar News