పంట పరిహారం కింద ఎకరానికి రూ.20 వేలు ఇవ్వాలి : ఎమ్మెల్యే రఘునందన్ రావు

అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా పుట్టెడు కష్టంలో ఉన్న అన్నదాతలను గట్టెక్కించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

Update: 2023-04-26 12:54 GMT

దిశ, దుబ్బాక: అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా పుట్టెడు కష్టంలో ఉన్న అన్నదాతలను గట్టెక్కించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బుధవారం దుబ్బాక మండలం రామక్కపేట, రఘోత్తంపల్లి, గోసాన్ పల్లి, ఆకారం, తిమ్మాపూర్, అక్బర్పేట - భూంపల్లి మండలం బొప్పాపూర్, ఎనుగుర్తి, మిరుదొడ్డి మండలం కొండాపూర్, అందె గ్రామాల్లో వడగండ్ల వానతో నష్టపోయిన పంటలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించి, రైతులకు నేనున్నానని భరోసా కల్పించారు.

మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో గాలి దుమారానికి కింద పడిపోయిన విద్యుత్ స్థంభానికి మరమ్మతులు చేపట్టి రైతులకు అందుబాటులోకి తీసుకరావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంట నష్ట వివరాలను త్వరితగతిన సేకరించాలని అధికారులకు ఆదేశించారు. పంటలను నమ్మి బతికే రైతులకు వడగండ్ల వానలు తీరని నష్టం చేకూర్చాయని అన్నారు, పంట నష్ట పరిహారాన్ని సకాలంలో చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు మరణించిన తరువాత రైతు భీమ,వస్తుందో లేదో కానీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతుల

నష్ట వివరాలను త్వరితగతిన సేకరించాలని అధికారులకు ఆదేశించారు. పంటలను నమ్మి బతికే రైతులకు వడగళ్ల వానలు తీరని నష్టం తీసుకొచ్చిందన్నారు, పంట నష్ట పరిహారాన్ని సకాలంలో చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు మరణించిన తర్వాత రైతు భీమా ఇస్తుందో.. లేదో.. కానీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పాత పంట రుణాలను మాఫీ చేయాలన్నారు. కొత్త పంటలు వేసుకునే రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని, పంటలు నష్ట పోయిన రైతులకు తక్షణమే పంట పరిహారం కింద ఎకరానికి రూ.20 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News