ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.

Update: 2024-11-07 14:59 GMT

దిశ, కొల్చారం: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం రంగంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో వై.మాందాపూర్, కోనాపూర్, పైతర, తుక్కాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిసిఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగే రమేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం సీజన్ ప్రారంభానికి ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంట వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించింది అన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఆలస్యం చేయడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు.

వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకోవాల్సిన సన్న రకం దొడ్డు రకం దాన్యాలను ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, అన్ని రకాల ధాన్యాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందజేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రైతులు తమ ట్రాక్టర్ల ద్వారా కూడా ధాన్యం మిల్లులకు తరలించేలా అనుమతులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు విష్ణువర్ధన్ రెడ్డి ,వెంకటేశం, మురళి గౌడ్, రంగంపేట సహకార సంఘం ఉపాధ్యక్షులు మల్లేశం డైరెక్టర్లు సాయిలు, జీవన్, ఎలుక గంగులు , బి ఆర్ ఎస్ నాయకులు రవితేజ రెడ్డి, సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు.


Similar News