క్రషర్ల మోతతో చస్తున్నాం.. రాళ్లకత్వ గ్రామస్తుల నిరసన

Update: 2024-08-15 13:44 GMT

దిశ, గుమ్మడిదల: దేశానికి స్వాతంత్ర వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ మా గ్రామానికి మాత్రం స్వతంత్రం రాలేదని రాళ్ళకత్వ గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న కంకర క్వారీ క్రషర్లను మూసేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలోని కంకర క్రషర్ల శబ్దాలు.. క్వారీల నుండి వచ్చే దుమ్ము దూళిని భరించలేకపోతున్నామ.. ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని తెలిపారు. నేడు నూతనంగా మరికొన్ని క్రషర్లను ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలు శాఖల అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడంలేదన్నారు. క్రషర్ల క్వారీల నుండి తమ గ్రామాన్ని కాపాడాలని, లేకుంటే భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. 

Tags:    

Similar News