అగ్నివీర్ దరఖాస్తులకు ఆహ్వానం

భారత సైన్యంలో 2025-26 సంవత్సరానికి అగ్నివీర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని ఆజాద్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్(రిటైర్డ్ ఆర్మీ) నీల చంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Update: 2025-03-13 14:36 GMT
అగ్నివీర్ దరఖాస్తులకు ఆహ్వానం
  • whatsapp icon

దిశ, దౌల్తాబాద్: భారత సైన్యంలో 2025-26 సంవత్సరానికి అగ్నివీర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని ఆజాద్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్(రిటైర్డ్ ఆర్మీ) నీల చంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్నివీర్ విభాగంలో జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్స్మన్ విభాగంలో పోస్టులు భర్తీ చేయనున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపిందని అన్నారు. ఈనెల 12 నుంచి ఏప్రిల్ 10 మధ్య ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. జూన్ లో ఆన్లైన్ పరీక్ష ఉంటుందని, దరఖాస్తుదారులు తమ అర్హతలను బట్టి ఏవైనా రెండు కేటగిరీలకు మాత్రమే దరఖాస్తు చేసుకో వచ్చుని తెలిపారు. 2004 అక్టోబర్ 1 నుంచి 2008 ఏప్రిల్ 1న మధ్య జన్మించిన పెళ్లి కాని పురుషులు మాత్రమే దరఖాస్తుకు అర్హులని, నియామక ప్రక్రియ పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా జరుగుతుందని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.


Similar News