సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు : అదనపు కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి అధికారులకు సూచించారు.

Update: 2024-11-11 12:56 GMT

దిశ, సంగారెడ్డి : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 39 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంచేలా సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. ప్రజల కష్టాలు, అవసరాలపై స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజ రాణి, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీపీఓ సాయిబాబా, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News