ఓడీఎఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఓడీఎఫ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Update: 2023-09-27 15:18 GMT

దిశ, సంగారెడ్డి:ఓడీఎఫ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం కంది మండలంలోని ఓడీఎఫ్ పరిశ్రమ వద్ద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నకు మద్దతు ప్రకటించిన జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని కంపెనీ సీజీఎంను 10 రోజుల్లో కలుస్తానన్నారు. సమస్యల పరిష్కారంలో సీజీఎం నిర్లక్ష్యం తగదన్నారు. నేను 10 రోజులో సీజీఎం అప్పాయింట్మెంట్ తీసుకుంటానని, ఒకవేళ అప్పాయింట్మెంట్ ఇవ్వకపోతే రెండోసారి, మూడోసారి కూడ అప్పాయింట్మెంట్ అడుగుతానన్నారు. ఐన ఇవ్వకపోతే 4వ సారి ఇక్కడ 2500 మందితో మీరు దీక్ష చేస్తారు, నేను 5వేల మందితో సీజీఎం ఆఫీస్ ముట్టడిస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ టీయూసీ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Tags:    

Similar News