ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక బంద్…ఆందోళనలో విద్యార్థులు
ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లు గా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయక పోవడం వల్ల కళాశాలలు నిర్వహించలేకపోతున్నమని
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లు గా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయక పోవడం వల్ల కళాశాలలు నిర్వహించలేకపోతున్నమని మేనేజ్మెంట్ ప్రకటించి నిరవధిక బంద్ చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలో 11 ప్రైవేటు డిగ్రీ కళాశాలు, 2 పీజీ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సుమారు 3500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ పీజీ కాలేజీల్లో సుమారు 250 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. 2021-22, 2022-23, 2023-24 విద్య సంవత్సరాల కు సంబంధించి డిగ్రీ కళాశాలలకు సుమారు రూ.5 నుంచి 6 కోట్లు, పీజీ కళాశాలలకు సంబంధించి సుమారు రూ.20 నుంచి 30 లక్షల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రావాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కళాశాలలు బకాయిలు విడుదల చేయాలని అధికారులను, మంత్రులు, ప్రజా ప్రతినిధులను కలిసి విన్నవించిన ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని మేనేజ్మెంట్ వాపోతున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్ మెంట్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని కోట్ల రూపాయలలో అప్పుల పాలయ్యామని బిల్డింగ్ రెంటులు కట్టలేక స్టాఫ్ కు జీతాలు ఇవ్వలేక అనేక అవస్థలు పడుతున్నట్లు ప్రైవేట్ కళాశాలల ఎదుట యాజమాన్యాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విద్యార్థులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక సమ్మె బాట పట్టడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.