సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రధాని మోదీ కృషి

సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు.

Update: 2024-03-21 14:49 GMT

దిశ, చౌటకూర్ : సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. మండల కేంద్రమైన చోటకుర్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…. జహీరాబాద్ పార్లమెంట్ సీటును నరేంద్ర మోదీ కి బహుమతిగా ఇవ్వాలని, ఇందుకు బూతు స్థాయి కార్యకర్తలే అత్యంత కీలకమన్నారు. పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీలు మొదలుకుని నిరుపేదలకు అందే ప్రతి పైసా నేరుగా పంపిణీ చేస్తున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంటులను నేరుగా పంచాయతీల అకౌంట్లోనే జమ చేస్తున్నారని ఇంతకన్నా నిదర్మనమేమిటన్నారు. గడిచిన రెండు పర్యాయాలు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆదరించి అక్కున చేరుకున్నానని అన్నారు. జహీరాబాద్ లోకసభ నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానన్నారు. తను ఇటీవల బీజేపీలో చేరానని, మరోసారి ఎంపీగా ఆదరించి అవకాశం ఇవ్వాలని బీబీ పాటిల్ కోరారు.

వచ్చే ఎలక్షన్ లో బీజేపీని తీసుకువెళ్లి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, న్యాయవాది బస్వరాజు పాటిల్, బీజేపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్, పండరి, ప్రవీణ్ రెడ్డి, శేఖర్, సాయి, వెంకటేష్, శ్రీనివాస్, మోహన్ ముదిరాజ్, అనిల్, మహాదేవ, పాల్గొన్నారు* మండల కేంద్రమైన చౌటకూర్ పాటుగా కొర్పొల్ గ్రామాలకు చెందిన వంద మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జహీరాబాద్ లోక్ సభ సభ్యుడు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ కండవాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సార రాజ్ కుమార్, విట్టల్ రెడ్డి, పెద్దిరెడ్డి పేటకు చెందిన రమేష్, బస్వరాజు పాటిల్, చౌటకూర్ మాజీ సర్పంచ్ గొంగ్లూర్ జనార్దన్ ముదిరాజ్,నాయకులు రియాజ్, సార్ ఆంజనేయులతో పాటు మరికొందరు ఉన్నారు.


Similar News