చలికాలంలో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి…
చలికాలంలో ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా రోగులు, చల్లగాలిలో, మంచు పట్టిన సమయంలో బయట తిరగడం మంచిది కాదని దుబ్బాక వంద పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.హేమరాజ్ సింగ్ తెలిపారు.
దిశ, దుబ్బాక: చలికాలంలో ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా రోగులు, చల్లగాలిలో, మంచు పట్టిన సమయంలో బయట తిరగడం మంచిది కాదని దుబ్బాక వంద పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.హేమరాజ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రతతో శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. చలికాలంలో వృద్ధులు, చిన్నారులు బయట తిరగకపోవడం మంచిదని, తప్పనిసరైతే తలకు మఫ్లర్, మంకీ టోపీలు, ముఖానికి మాస్కులు ధరంచి బయటకు రావడం మంచిదన్నారు. దీంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల శుభ్రత చాలా ముఖ్యమని, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో దోమలు వ్యాప్తిచెంది టైఫాయిడ్, డెంగీ, చికెన్‌గున్యా, మెదడువాపు, విషజ్వరాలు బారిన ప్రమాదం ఉంటుందన్నారు. తాగునీటి విషయంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలుషిత నీరు తాగితే డయేరియా వ్యాపించే ప్రమాదకరంగా పరిణమిస్తుందన్నారు. గాలి ద్వారా స్వైన్‌ఫ్లూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకే అవకాశాలు ఉంటాయని తెలిపారు. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఎక్కువగా జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుందని, కాబట్టి పౌష్టికాహారం, రోగనిరోధక శక్తి పెంచే ఫుడ్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ముఖ్యంగా చలికాలంలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడకం తగ్గించాలి. చర్మంపై అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో బయట తిరగడం తో జలుబు, జ్వరం, ఫ్లూ వంటివి వ్యాధులు సోకితే ఆరోగ్యం పాడవుతుంది. వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేసుకోవాలని కోరారు.