దిశ, సిద్దిపేట: సిద్దిపేట మండలం చిన్న గుండవెల్లి గ్రామ శివారులోనీ పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 8 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 36,930 రూపాయలు, 6 బైక్స్, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సీఐ గురు స్వామి మాట్లాడుతూ.. పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ సిఐ గురుస్వామి హెచ్చరించారు. గ్రామాల్లో, ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్: 7901100100 కు సమాచారం అందించాలని కోరారు.