పేట బంద్ విజయవంతం.. ప్రశాంతంగా కొనసాగిన భారీ నిరసన ర్యాలీ..

సదాశివపేట పట్టణంలోని ప్రభుమందిరం వద్ద గల పురాణ హనుమాన్ మందిరంలో గత మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-19 06:52 GMT

దిశ, సదాశివపేట : సదాశివపేట పట్టణంలోని ప్రభుమందిరం వద్ద గల పురాణ హనుమాన్ మందిరంలో గత మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు పట్టణంతో పాటు, మండల వ్యాప్తంగా హిందువులు, పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రశాంతంగా నిరసన ర్యాలీ, సదాశివపేట పట్టణం బంద్ విజయవంతం చేశారు. ఈ సంఘటన విషయంలో నిందితుల పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని, అగంతకులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నినదించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, కొంతమంది మతోన్మాద శక్తులు దాడికి పాల్పడి మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎంతమంది ఉన్నారో పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో పోలీసు పహారాలో బంద్, నిరసన ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించేల సీఐ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.


Similar News