కర్ణాటకలో మళ్లీ బీజేపీదే అధికారం.. బీజేపీ అధికార ప్రతినిధి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప అన్నారు.
దిశ, నారాయణఖేడ్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో కలిసి గౌరీబిధనూర్, బాగేపల్లి, యలహంక, ములబాగిలు, చింతామణి నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. బాగేపల్లి, చింతామణిలో జరిగిన భారీ రోడ్ షో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయం పై సంగప్ప గౌరీబిధనూరులో ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులంతా బిజీగా ఉన్నారు. ఈ ప్రచారంలో కోలార్ ఎంపీ ముణిస్వామి, పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షులు డా.మనోహర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర రావు, అధికార ప్రతినిధి తుళ్ళ వీరేందర్ గౌడ్, అక్కడి బీజేపీ అభ్యర్థులు డాక్టర్ శశిధర్, మునిరాజ్, సుందర్ పాల్గొన్నారు.