ప్రతి జిల్లాకు పారామెడికల్ కాలేజీః మంత్రి దామోదర రాజనర్సింహ

Update: 2024-08-18 14:59 GMT

దిశ, ఝరాసంగం : రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారా మెడికల్ కాలేజీ, నియోజకవర్గం పరిధిలో నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో రూ:200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులను మంజూరు చేసినట్టు తెలిపారు. సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, రాఘవపూర్-హుమ్నపూర్ గ్రామాల శివారు,"పంచవటి పుణ్యక్షేత్రం"లో భక్తుల ఆర్థిక సాయంతో రూ.8 కోట్లతో 'శ్రీ కాశీనాథ్ బాబా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను శ్రీ కాశీనాథ్ బాబా, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి దామోదర మాట్లాడుతూ.. తను మంత్రిగా ఉన్న ప్రతిసారి సేవ చేసే భాగ్యం కలగడం ఎంతో సంతోషకరమని చెప్పారు. నారాయణఖేడ్ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడి ఉందన్నారు. కళాశాల ఏర్పాటుచేసి యువతి, యువకులకు స్వయం ఉపాధి కలిగించేలా చొరవ తీసుకుంటామన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన చికిత్స,శాస్త్ర చికిత్సలు జరిగేలా ప్రభుత్వం దృష్టి సారించింది అన్నారు.

మంత్రి చొరవతో అనుకున్నది సాధిస్తాం : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతోనే తనకు నారాయణఖేఢ్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ దక్కిందని, ఆరోగ్యశాఖ మంత్రి సహకారంతో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను అధికమిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే విజయ పాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహమ్మద్ తన్వీర్, ఉజ్వల్ రెడ్డి, మంకల్ సుభాష్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సిద్ధి లింగయ్య స్వామి, కిరణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, మండలంలోని ఆయా గ్రామలతో పాటు వివిధ మండలాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News