ఆయిల్‌ ఫాం సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నిర్దేశిత లక్ష్యాల మేరకు రైతులు ఆయిల్ ఫాం సాగుచేసేలా అధికారులు పని చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Update: 2023-03-17 12:36 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: నిర్దేశిత లక్ష్యాల మేరకు రైతులు ఆయిల్ ఫాం సాగుచేసేలా అధికారులు పని చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ లో శుక్రవారం ఆయిల్ ఫాం సాగుపై వ్యవసాయ, ఉద్యానవన, ఆయిల్ ప్రేడ్ కార్పొరేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 31లోపు లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అధికారులను అదేశించారు.

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లాభదాయ పంట అయిన ఆయిల్ ఫాం సాగుకు రైతులు మొగ్గు చూపేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అదే సమయంలో రైతులకు రాయితీలను, డ్రిప్ పరికరాలను త్వరతగతిన అదించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రామలక్ష్మి, అయిల్ ప్రేడ్ మెనెజర్ సుధాకర్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News