ఒర్రకుంట అక్రమణలపై కదిలొచ్చిన అధికారులు : దిశ కథనానికి స్పందన
జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఒర్రకుంటలో యథేచ్ఛగా కొనసాగిస్తున్న అక్రమ నిర్మాణాలపై దిశ పత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు.
దిశ, గుమ్మడిదల : జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఒర్రకుంటలో యథేచ్ఛగా కొనసాగిస్తున్న అక్రమ నిర్మాణాలపై దిశ పత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. మంగళవారం ఈఈ మధుసూదన్ రెడ్డి, ఆర్డీవో నాగేష్, స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి కుంట స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే అనంతరం పూర్తి వివరాలను తెలియజేసి కుంటలో జరుగుతున్న నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుంటలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వార్తను ప్రచురించినందుకు గాను బొల్లారం ప్రజలు దిశ పత్రికను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీఈఈ రామస్వామి, తహసీల్దార్ దశరథ్ సింగ్, ఏఈఈ దిలీప్, ఆర్ఐ జయప్రకాశ్, సర్వైవర్ రామభద్రం, తదితరులు పాల్గొన్నారు.