దిశ ఎఫెక్ట్.. కదిలిన యంత్రాంగం..
తాగునీటి సమస్య తీర్చేందుకు అధికారులు కదిలి వచ్చారు.
దిశ, నిజాంపేట : తాగునీటి సమస్య తీర్చేందుకు అధికారులు కదిలి వచ్చారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో మైసమ్మ కాలనీలో నీటి సమస్య పై ఆగ్రహించిన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన పై దిశ పత్రికలో ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన మిషన్ భగీరథ అధికారులు గురువారం కాలనీలో జేసీబీతో కాలువను తీసి పైప్ లైన్ వేశారు. నీళ్ళు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీలో అధికారులు వచ్చి సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకోవడం పై సంతోషం వ్యక్తం చేశారు. నీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.