రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరగలేదు: ఎమ్మెల్యే రఘునందన్ రావు
బీఆర్ఎస్ మొదటి కేబినెట్ లో మహిళ మంత్రి లేకపోవడం వివక్షతకు నిదర్శనమని, రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరగలేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
దిశ, మెదక్ టౌన్: బీఆర్ఎస్ మొదటి కేబినెట్ లో మహిళ మంత్రి లేకపోవడం వివక్షతకు నిదర్శనమని, రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరగలేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. పట్టణంలోపి భారత్ గార్డెన్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న దుబ్బాక ఎమ్మేల్యే రఘునందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళలకు ఉన్నతమైన స్థానం ఉందన్నారు. పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో సమానంగా పోటి పడుతున్నారని తెలిపారు.
సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు వారు నిర్వర్తించే బాధ్యతను సంపూర్ణవంతగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు వానికి ఉన్నాయని, ఉంటాయని కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎమ్మెల్యే, ఎంపీ కాలేకపోయిందన్నారు. సీఎం కూతురు కవిత ఎంపీ, ఎమ్మెల్సీ ఎలా అయ్యిందంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణ ఉద్యమంలో కవిత ఎక్కడుందని ప్రశ్నించారు. 2004 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్నా.. ఏరోజూ కవిత చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యం గురించి మాట్లాడలేదన్నారు. కానీ మహిళల హక్కుల కోసం 33 శాతం రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో ధర్నా చేస్తుంటే.. భయపడి బీజేపీ సీబీఐ చేత నోటీసులు ఇప్పించారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహిళల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. త్వరలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడతామని తెలిపారు.