జ్వరం సర్వేపై నిర్లక్ష్యమా..? వైద్య సిబ్బందిపై డీఎంహెవో ఫైర్
గ్రామాల్లో నిర్వహిస్తున్న జ్వరం సర్వేపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
దిశ, చిన్నశంకరంపేట: గ్రామాల్లో నిర్వహిస్తున్న జ్వరం సర్వేపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని సూరారం గ్రామంలో డెంగీతో మృతిచెందగా అప్రమత్తమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దాన్ని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ పరిశీలించారు. జ్వరంతో బాధపడుతున్న వారి ఇండ్లకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఏ ఇంట్లో అయినా డెంగీ వస్తే ఆ కుటుంబ సభ్యులకు అందరికీ రక్త పరీక్షలు చేయాలని వైద్య అధికారులకు సూచించారు.
ఇదే గ్రామానికి చెందిన బక్కన్న రమేష్ గత 25 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాని తెలిపారు. ఇప్పటి వరకు ఏమైనా చికిత్స చేశారా, టాబ్లెట్స్ ఇచ్చారా అని వైద్యాధికారులను అడగగా ఇవ్వలేదని సమాధానం చెప్పడంతో అధికారులపై ఆయన ఆగ్రహం చేశారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే సరిపోదని, వారికి రక్త పరీక్షలు చేసి రక్త నమూనా పరీక్షలు ల్యాబ్ పంపి టాబ్లెట్స్ ఇవ్వాలని సూచించారు. రమేష్ అనే వ్యక్తి నుంచి బ్లడ్ శ్యాపింల్స్ తీసుకుని మలేరియా అధికారితో వైద్యాధికారి శ్రీరామ్ రక్త పరీక్షలు తీసి మలేరియానా లేదా డెంగ్యా ల్యాబ్ పంపించి తెలుసుకోవాలన్నారు.
గ్రామంలో మొత్తం 9 మంది జ్వరంతో బాధపడుతున్నారని, రక్త పరీక్షల ద్వారా తెలిసిందన్నారు. కాదా మరో 40 మంది వరకు జ్వరంతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ వైద్యాధికారి లీలా, జిల్లా మలేరియా అధికారి విజయేందర్, ఎంపీడీవో దామోదర్, వైద్య అధికారి డాక్టర్ సాయి సింధు, ఉదయ్ నందిని, సీహెచ్‌వో యాదగిరిరావు, ఏఎన్ఎంలు బాల నరసమ్మ, మంజుల, కవిత, ఊర్మిళ, నాగమణి, ప్రియాంక, స్వప్న, బుజ్జి, కవిత, సంతోష్, ఆశ వర్కర్లు, బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షులు జనగాం మల్లారెడ్డి, మాజీ సర్పంచులు చిలక నాగరాజు, తదితరులు పాల్గొన్నారు