ప్రాణాలను బలి తీసుకుంటున్న నర్సాయపల్లి రోడ్డు
చేర్యాల పట్టణ కేంద్రం నుంచి నర్సాయపల్లి కి వెళ్ళే రహదారి
దిశ, చేర్యాల: చేర్యాల పట్టణ కేంద్రం నుంచి నర్సాయపల్లి కి వెళ్ళే రహదారి నిత్యం రక్తసిక్తం అవుతుంది.ఒకే చోట నెల వ్యవధిలోనే రెండు ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయాల పాలు కావడంతో ఆ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు.దీని అంతటికి ప్రధాన కారణం చేర్యాల నుండి నర్సాయపల్లికి వెళ్లే మార్గమధ్యంలో బీటీ రోడ్డుకు ఆనుకొని వ్యవసాయ బావి ఉండటంతో రొడ్డును మళ్లించారు.తద్వారా ప్రయాణికులు ఎదురుగా వస్తున్న వాహనాలు గుర్తించక లేక పోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.