జిల్లా కలెక్టర్‌ను కలిసిన నారాయణరావు లేఔట్ బాధితులు..!

అమీన్ పూర్ నారాయణరావు లేఔట్ లోని సర్వేనెంబర్ 1000 లో ప్లాట్లు ఉన్న తమ భూమిని అటవీ శాఖకు కేటాయించడం ఆపాలని నారాయణరావు లేఔట్ ప్లాట్ ఓనర్స్ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కి విజ్ఞప్తి చేశారు.

Update: 2024-07-09 07:49 GMT

దిశ, పటాన్ చెరు: అమీన్‌పూర్ నారాయణరావు లేఔట్‌లోని సర్వేనెంబర్ 1000 లో ప్లాట్లు ఉన్న తమ భూమిని అటవీ శాఖకు కేటాయించడం ఆపాలని నారాయణరావు లేఔట్ ప్లాట్ ఓనర్స్ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి విజ్ఞప్తి చేశారు. సోమవారం నారాయణరావు లేఔట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ క్రాంతిని కలిశారు. 1988 లో 289 ఎకరాల ఈ లే ఔట్ లో సర్వేనెంబర్ 1000 లో ఉన్న భూమిని ల్యాండ్ కన్వర్షన్‌తో నారాయణ్ రావు లేఔట్ వేశారని, ఈ లేఔట్లలో ప్లాట్లను చిరుద్యోగులు మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేశారన్నారు. నారాయణరావు లేఔట్ కు సంబంధించిన భూములు డీఆర్ఓ కస్టడీలో ఉన్నాయన్నారు. సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు ప్లాట్లను తమకప్పగించాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న అధికారులు,ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సర్వేనెంబర్ 1000 లో గల భూమిని అటవీశాఖ అప్పగించి మొక్కలు పెంచే కార్యక్రమం చేపడుతున్నారని వెంటనే ఈ వివాదాస్పద భూమి కేటాయింపు ను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ లేఔట్ విషయంలో ప్రభుత్వ నిర్ణయం వచ్చేవరకు యదార్థత స్థితిని కొనసాగించాలన్నారు. అదే విధంగా సర్వేనెంబర్ 1000 లో కొందరు తమ నిర్మాణాలకు అనుకూలంగా ఉండేలా అక్రమంగా రోడ్డు నిర్మించారని వెంటనే ఆ రోడ్డు ని తొలగించాలని కోరారు. వెంటనే జిల్లా కలెక్టర్ విషయంలో చొరవ తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు.


Similar News