అద్వానంగా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది. ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల
దిశ, గుమ్మడిదల : ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది. ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను వివిధ పథకాలను ప్రవేశ పెడుతూ.. అన్ని విధాలుగా అభివృద్ధి మార్గంలో తీర్చిదిద్దుతున్నామని తెలుపుతున్నప్పటికీ.. అవేవీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని నిరూపించడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ప్రాథమిక పాఠశాల... సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుమారు 300 వందలకు పై చిలుకు విద్యార్థులు ఉన్నారు. ఒకవైపు రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. ఇంత మంచి సంఖ్య బలం ఉన్న పాఠశాలలో మాత్రం ఏళ్ల తరబడి విద్యార్థులు కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు. త్రాగు నీటికి మంచి వసతి లేదు. సరిపోయే మూత్రశాలలు లేవు. నేషనల్ హైవే రోడ్డు కి ఆనుకొని ఉన్న విద్యార్థుల రక్షణకై ప్రహరీ గోడ గేటు రక్షణ కూడా లేదు.
ఇలా విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక ఏళ్ల తరబడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ పాఠశాలలో చదివే ఓ చిన్నారి విద్యార్థి మధ్యాహ్నం సమయంలో ఆడుతూ పడుతూ ఒక్కసారిగా రోడ్డు పైకి వెళ్లేసరికి అతి భారీ వాహన ఢీకొట్టడంతో శేరిరం మొత్తం నుజ్జునుజ్జు అయి చిన్నారి అక్కడికి అక్కడే మృతి చెందింది. అయినప్పటికీ అధికారులు మాత్రం విద్యార్థుల రక్షణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇక ఇటీవలే గత కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమానికి ఈ పాఠశాలను ఎంపిక చేసి పలు తరగతి గదుల నిర్మాణం స్కూల్ ప్రహరీ గేటు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులు మొదలై 8 నెలలు గడిచిన పనులు పూర్తి కాలేదు. ఈ తరగతి గదుల నిర్మాణ పనుల కోసం పాత బిల్డింగ్ దానికి అనుకుని ఉన్న మూత్రశాలలను కూల్చి వేసి నూతన బిల్డింగ్ పనులను మొదలు పెట్టారు. కానీ ఈ నిర్మాణ ఆగిపోయి రెండు నెలలు కావస్తోంది. అసలు ఈ పనులు ఎందుకు ఆగాయన్న స్పష్టత విద్యాశాఖ అధికారులకు ఇప్పటి వరకు లేకపోవటం గమనార్హం. కాగా ఎండాకాలం సులువు ముగించుకొని పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ లో విద్యార్థులకు మూత్ర శాలలు లేవు. పూర్తిగా పాడుపడ్డ బంగ్లాల పాఠశాల తయారయింది. ఇప్పుడు ఈ సమస్యలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను కలవర పెడుతున్నాయి. మరి ఇప్పటికైనా విద్య శాఖ అధికారులు ఈ విషయాలపై దృష్టి సారించింది సమస్యలను పరిష్కారం చూపి నిర్మాణ పనులను మొదలు పెడతారా? లేదా అన్న విషయం వెచి చూడాలి.