సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన..

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో టీఎస్ఐఐసీ సహకారంతో రూ. 35 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గురువారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.

Update: 2023-02-23 14:48 GMT

దిశ, జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో టీఎస్ఐఐసీ సహకారంతో రూ. 35 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గురువారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించే నిధులతో పాటు సీఎస్ఆర్ సహకారంతో గ్రామీణ రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వం ఇటీవల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిన్నారం మండలానికి రూ. రెండు కోట్ల నిధులు మంజూరు చేసిందని, వీటి ద్వారా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. దీంతో పాటు గ్రామాల మధ్య అంతర్గత రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ రేఖా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News