MLA Goodem :నిరంతరాయ విద్యుత్​ కోసం కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు

ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు అందించేందుకు నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (MLA Goodem Mahipal Reddy)తెలిపారు.

Update: 2024-10-30 10:45 GMT

దిశ, పటాన్ చెరు : ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు అందించేందుకు నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (MLA Goodem Mahipal Reddy)తెలిపారు. బుధవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణం, పటాన్ చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ, పోచారం, భారతి నగర్ డివిజన్ పరిధిలో బీడీ ఎల్ కాలనీ పరిధిలో నూతన సబ్​​స్టేషన్ల ఏర్పాటు కోసం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కోతలు లేని నిరంతరాయ విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

    ఈ నేపథ్యంలో పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో 12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 KV సబ్ స్టేషన్, పోచారం, రామేశ్వరం బండ పరిధిలో రూ.ఏడు కోట్లు, భారతి నగర్ డివిజన్ పరిధిలో రూ. ఆరుకోట్ల అంచనా వ్యయంతో మూడు 33/11 KV సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అతి త్వరలో స్థలాలను కేటాయించి సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, విద్యుత్ శాఖ డీఈ భాస్కరరావు, ఏడీ దుర్గాప్రసాద్, తహసీల్దార్ రంగారావు, రామేశ్వరం బండ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి, సీనియర్ నాయకులు నాగేష్, పరమేష్, ఐలేష్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News