ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడికి యత్నించారు.
దిశ, హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేపి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఈ ముట్టడిలో కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరామ్ చక్రవర్తి, లక్ష్మారెడ్డి, బొమ్మ గాని సతీష్, శంకర్, బాబు తదితరులు పాల్గొన్నారు.